![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -292 లో.. ముకుంద వాళ్ళ అన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. కార్ కి ఆక్సిడెంట్ అయిన దగ్గరికి వెళ్లి చూస్తాడు.. పడిపోయి ఉన్న మురారి దగ్గరికి వెళ్లి బ్రతికి ఉన్నాడో లేదో చూస్తాడు. బ్రతికి ఉన్నాడని అనుకొని తను ఆక్సిడెంట్ చేపించిన రౌడీల దగ్గరికి వెళ్లి.. నేను చెప్పినట్టు చేశారని చెప్తాడు. ఆ తర్వాత మురారిని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్తారు.
మరొక వైపు రేవతి అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ప్రభాకర్ వెళ్తుంటాడు. ఇంతలో దారి పక్కన కొంతమంది ఉండడం చూసి ప్రభాకర్ బండి ఆపి అక్కడకీ వెళ్లి చూస్తాడు. అక్కడ దెబ్బలు తగిలి పడిపోయి ఉన్న కృష్ణని చూసి ఏడుస్తు కొంతమంది మంది సహాయంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు మురారి గురించి డాక్టర్ లు మాట్లాడుకుంటారు. ట్రీట్ మెంట్ బాగా చెయ్యండని ముకుంద వాళ్ళ అన్నయ్య డాక్టర్స్ కి చెప్తాడు. మరొక వైపు అన్నయ్య మురారి గురించి మాట్లాడాలని హాస్పిటల్ ఎందుకు రమ్మన్నాడని హాస్పిటల్ కి వచ్చిన ముకుంద ఆలోచిస్తుంది. అప్పుడే తన అన్నయ్య వచ్చి మురారికి దెబ్బలు తగినట్టు చెప్తాడు. తనే అదంతా చేసినట్టు ముకుందకి చెప్పడు. మురారి బాగయ్యాక పెళ్లి చేస్కోమని తన ముకుందకి వాళ్ళ అన్నయ్య చెప్తాడు. మరొక వైపు డాక్టర్స్ కృష్ణకి ట్రీట్ మెంట్ చేస్తుంటారు. ప్రభాకర్ దగ్గరికి శకుంతల వస్తుంది. తనకి ప్రభాకర్ జరిగిందంత చెప్తాడు.
మరొక వైపు ముకుంద వాళ్ళ అన్నయ్య మురారికీ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ కేబిన్ దగ్గరికి వస్తాడు. నేను చెప్పినట్లు చెయ్యండంటు బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్స్ చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. మరొక వైపు కృష్ణ బాగయ్యాక మనతో తీసుకొని వెళదామని ప్రభాకర్ తో శకుంతల అంటుంది. ఆ తర్వాత కృష్ణ స్పృహలోకి వస్తుంది. దాంతో ప్రభాకర్, శకుంతల ఇద్దరు కృష్ణ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |